ఎన్నికల వేళ కీలక భద్రత: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డ్రోన్ నిఘా
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
రాబోయే ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కీలక మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను అధికారుల బృందం పరిశీలించింది. మౌలిక వసతులను తనిఖీ చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.