జన్నారంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలో పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం మండల స్థాయి సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు.