చిరువ్యాపారాల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లోజు ఆచారి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వాసుపత్రి ముందు దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఆదుకోవాలని బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డబ్బాలను తొలగించడం, కరెంట్ నిలిపివేయడం వల్ల పేద కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.