పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై కాంగ్రెస్ గుండాల దాడి యత్నం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. వినాయక చవితి రోజున కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌ను సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో వేధించడమే కాక, పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడికి యత్నించడం దారుణమని ఖండించారు. కాంగ్రెస్ గుండాల అరాచకం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.