రైల్వే ప్రయాణికులకు అలర్ట్: రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవని స్పష్టం చేశారు. ముంబై లోకల్ రైలులో పవర్ బ్యాంక్ పేలిన ఘటన నేపథ్యంలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని అన్ని జోన్ల అధికారులను ఆదేశించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.