అమరావతి రాజధానిలో రెండో దశ భూసేకరణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చేపడుతున్న రెండో దశ భూసేకరణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు రెండో దశలోనూ రూ.40 వేల చొప్పున కౌలు చెల్లించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరినీ బలవంతం చేయకుండా పూర్తిగా స్వచ్ఛంద అంగీకారంతోనే భూసేకరణ కొనసాగుతోందని, అక్టోబర్ చివరి నాటికి 80 శాతం పనులు పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.