అనంతపురంలో బైకులు ఢీకొని కానిస్టేబుల్ సహా ఇద్దరికి గాయాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్లగ్రామం వద్ద రెండు బైకులు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాజు నాయక్‌తో పాటు హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.