ఇండియన్ సూపర్ లీగ్: మోహన్ బగన్పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ సంచలన విజయం

రిపోర్టర్: నరేష్ స్థలం: గౌహతి

గౌహతి వేదికగా జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టుపై నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఘన విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ చివరి నిమిషంలో సూపర్ సబ్ జితిన్ ఎంఎస్ గోల్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని వారు పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి మోహన్ బగన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ, నార్త్ ఈస్ట్ డిఫెన్స్ వరుస దాడులను సమర్థంగా తిప్పికొట్టిందని నిర్వాహకులు వెల్లడించారు.