సూర్య సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: ఢిల్లీ
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన సూర్య అంత్ సే ఆరంభ్ తక్ చిత్రం విడుదలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించినట్లు న్యాయస్థానం తెలిపింది. వైద్యులను అవినీతిపరులుగా చూపుతున్నారని దాఖలైన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. నవంబర్ 20న సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మార్గం సుగమమైందని ధర్మాసనం వెల్లడించింది.