పాన్ మసాలా ప్రకటనల వివాదం: షారుఖ్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్పై ఎఫ్డీఏ కొరడా

రిపోర్టర్: హరి స్థలం: Mumbai

మహారాష్ట్రలో సరోగేట్ ప్రకటనల నిబంధనలను ఉల్లంఘించిన ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లపై విచారణ ముగిసినట్లు ఆ రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ కమిషనర్ తుకారాం ముండే శుక్రవారం స్పష్టం చేశారు. విమల్ పాన్ మసాలా యాడ్స్కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని, వచ్చే వారం ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం జాయింట్ కమిషనర్ ముందుంచనున్నట్లు ఆయన వెల్లడించారు.