ఫగ్వాడా ఎల్పీయూ హింసాకాండ కేసు: ఐదుగురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Phagwara
ఫగ్వాడాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళన సందర్భంగా హింసకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం, ఆదివారం రాత్రి క్యాంపస్లో జరిగిన అల్లర్లు, జాతీయ రహదారి దిగ్బంధనం, పోలీసు వాహనాల దహనంపై సత్యనంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.