హనీమూన్‌లో విషాదం బార్బెక్యూ ప్రమాదంలో నవవధువుకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: West Bengal
డార్జిలింగ్‌లోని సిట్టాంగ్‌లో జరిగిన హనీమూన్ ట్రిప్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. హోమ్‌స్టేలో జరిగిన బార్బెక్యూ ప్రమాదంలో నికితా సాహా అనే నవవధువుకు తీవ్ర గాయాలయ్యాయి. బార్బెక్యూ మంటల్లో రసాయనం పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆమె శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.