నెల్లూరు ఇస్కాన్ సిటీలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరం లోని ఇస్కాన్ సిటీలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇస్కాన్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత రసం రామకృష్ణారెడ్డి దంపతులు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆర్ఆర్ఆర్ కుటుంబ సభ్యులకు అర్చకులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.