తెలంగాణలో కలకలం: రైతుభరోసా నిధులు జమ అయ్యాయంటూ నకిలీ మెసేజ్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
రైతుల ఖాతాల్ లో రైతుభరోసా నిధులు జమయ్యాయంటూ వచ్చిన అనధికారిక ఎస్ఎంఎస్ లతో అన్నదాతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో తప్పుడు సందేశాలు అందాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు వెల్లడించారు.