రాష్ట్రంలో నవంబర్ ఒకటి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన ధాన్యం సేకరణ సన్నద్ధత కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్లో దాదాపు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం కొనుగోలుతోపాటె నేరుగా రైతుల ఖాతాల్లోకి రవాణా ఛార్జీలు జమ చేసే సంస్కరణలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.