అంగన్వాడీ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల విచారణ
రిపోర్టర్: నరేష్
స్థలం: నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి అక్రమంగా బైక్ పై తరలిస్తున్న బియ్యం బస్తాను శనివారం గ్రామస్థులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ మహేశ్వరి, సూపర్ వైజర్ ఆషా కేంద్రానికి చేరుకుని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. గత రెండు మూడు నెలలుగా బియ్యం నిల్వలు నిలిచిపోయినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై సోమవారం తుది విచారణ నివేదిక అందజేస్తామని సీడీపీఓ తెలిపారు.