గత బీఆర్ఎస్ భూ కేటాయింపులపై విచారణకు హైలెవల్ కమిటీ వేసిన రేవంత్ సర్కార్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో 22ఏ దుర్వినియోగంపై జరిగిన చర్చ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా, రాజీవ్ గాంధీ హనుమంతు కన్వీనర్‌గా ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. సిద్దిపేట, రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లోని భూముల ఉల్లంఘనలపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించనుంది.