భక్తిపారవశ్యంతో పులకించిన విద్యానగర్ వినాయక మండపాలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ రాపర్తి నగర్-2 విద్యానగర్ కాలనీలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. యెగినాటి మాధవరావు, ఉమాదేవి దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ ఎం. సింహారెడ్డి, కార్యదర్శి మందడపు శ్రీనివాసరావు సహా పలువురు సభ్యులు హాజరయ్యారు. కాలనీలో రెండో సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.