'నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు': గణేష్ ఉత్సవాలపై శింగనమల పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: Anantapur

అనంతపురం జిల్లా శింగనమల మండలంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, మండపాల ఏర్పాటుకు ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.