ముంబైలో తీవ్ర విషాదం: పెళ్లి వేడుకలో అపస్మారక స్థితిలోకి వంద మంది అతిథులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ముంబై

ముంబైలోని నహుర్ ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలో అనుమానాస్పద ఆహార విషతుల్యత కారణంగా సుమారు వంద మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు సోమవారం వెల్లడించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భోజనం చేసిన వారు కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఆహార భద్రత అధికారులు వెంటనే స్పందించి నమూనాలు సేకరించగా, బాధితులంతా కోలుకుంటున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కేటరర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.