ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Vijayawada
ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకున్నట్లు I&PR AP వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అలాగే ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావు అందుకున్నట్లు తెలిపారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం సాధించిన ఈ ఘనత రాష్ట్రానికి మరో మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.