కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ హల్చల్

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కోవూరులో కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన అనుచరుడి అరెస్ట్‌పై అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.