విశాఖ జిల్లా ఎల్ కోట మండలం బాధితులకు ఆర్థిక సాయం

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

విశాఖ జిల్లా ఎల్ కోట మండలం రంగరాయపురం గ్రామంలో తుఫాన్ కారణంగా నేలమట్టమైన పెంకుటిల్లు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల నగదును అందజేయడం జరిగిందని లలిత కుమారి విజయనగరం వెల్లడించారు. తుఫాన్ ధాటికి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలకు ఈ సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయం అందించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.