విజయనగరం మార్కెట్ చెక్‌పోస్టుల్లో ఈ పోస్ యంత్రాల ద్వారా సెస్‌ వసూలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల ద్వారా జరిగే సెస్‌ వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు మాన్యువల్ పద్ధతిలో జరుగుతున్న వసూళ్లలో లెక్కల తేడాలు రాకుండా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీల పరిధిలోని 12 చెక్‌పోస్టులకు ఈ యంత్రాలను సరఫరా చేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారి రవికిరణ్ తెలిపారు.