నూతన జిల్లాల దశాబ్ది వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ సంబురాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
నూతన జిల్లాల ఆవిర్భావ దశాబ్ది వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి 2కే రన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే జిల్లాల ఏర్పాటు చేపట్టామని గులాబీ నేతలు వెల్లడించారు. మంచిర్యాలలో సభ వేదికను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.