పింఛన్ల గడువు పెంపుకోసం రోడ్డెక్కిన అరకు నియోజకవర్గ జనం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: అరకు వ్యాలీ
అరకు వ్యాలీ మండలంలో పింఛన్ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ అరకు నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు వంతల కొండలరావు తెలిపారు. యాభై ఏళ్లు నిండిన వారు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ధ్రువీకరణ పత్రాల జాప్యం, సర్వర్ సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దరఖాస్తు గడువును మరో పదిహేను రోజులు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.