రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రెండు వేల ఐదు వందల కోట్లు: భట్టి విక్రమార్క

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల ఆధునికీకరణ మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో కలిసి పలు ఆలయాలను ఆయన సందర్శించి, నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.