కాకినాడ జిల్లాలో పులి సంచారం.. అటవీ శాఖ హై అలర్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఏలేశ్వరం సెక్షన్ పెద్దిపాలెం బీట్‌లోకి పెద్దపులి ప్రవేశించడంతో అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. రేడియో కాలర్ ద్వారా ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి ఉనికిని గుర్తించారు. ధారపల్లి, బురదకోట, మిర్తివాడ, బావురువాక, తడువాయి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరించారు. భద్రతా చర్యల్లో భాగంగా ధారపల్లి జలపాతం ప్రాంతంలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.