ప్రముఖుల ఓట్ల తొలగింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మరియు వివాదం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైంది. కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ సహా పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే గత రికార్డులతో డేటా మ్యాపింగ్‌ కాకపోవడం వల్లే నోటీసులు ఇచ్చామని, ఓటు తొలగించినట్టు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పష్టం చేశారు.