దారుణం: కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bengaluru
బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర సమీపంలో కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన యాభై ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ వరలక్ష్మి పండుగకు ఇంటికి వచ్చిన పదవ తరగతి చదువుతున్న బాలికపై ఆమె తండ్రి ఈ దురాగ్యానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. తోటి విద్యార్థినుల ద్వారా విషయం వెలుగులోకి రావడంతో, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.