ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడుగురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం డీఎఫ్ఓగా శివకుమార్ గంగాల్, చింతూరు డీఎఫ్ఓగా గరుడ్ సంకేత్ సునీల్ నియమితులయ్యారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్గా వెంకట శ్రీకాంత్, కడప డీఎఫ్ఓగా బాలరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా డీఎఫ్ఓగా నీరజ్ హాన్స్, విజయనగరం డీఎఫ్ఓగా బబితా కుమారి, అనంతపురం డీఎఫ్ఓగా రవీంద్రనాథ్ రెడ్డికి పోస్టింగ్లు దక్కాయి.