తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుపాను ముప్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృగాలను రంగంలోకి దించామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.