మోహన్ బగాన్తో మ్యాచ్ సవాల్తో కూడుకున్నదన్న ఖువాన్ పెడ్రో బేనాలీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కోల్‌కతా

ఐఎఫ్ఏ షీల్డ్లో భాగంగా మోహన్ బగాన్ జట్టుతో తలపడటం తమకు మంచి సవాల్ అని నార్త్ ఈస్ట్ యునిటెడ్ ఎఫ్సీ హెడ్ కోచ్ ఖువాన్ పెడ్రో బేనాలీ తెలిపారు. శ్రీనిది డెక్కన్పై విజయం సాధించిన తమ జట్టు, మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవుతోందని సోమవారం ఆయన పేర్కొన్నారు. నూతన సీజన్కు ఈ మ్యాచ్ చక్కటి సన్నాహకంగా ఉపయోగపడుతుందని, ప్రతి మ్యాచ్ను జాగ్రత్తగా ఆడతామని ఆయన స్పష్టం చేశారు.