టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలతా దేవిపై దుండగుల భౌతిక దాడి
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై ఇందిరానగర్ రాఘవ గెస్ట్ హౌస్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో దుండగులు భౌతిక దాడికి పాల్పడ్డారు. పదవికి రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ రికార్డులను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.