కేంద్ర పన్నుల వాటా విడుదల: ఏపీకి నాలుగు వేల కోట్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: దిల్లీ
కేంద్ర పన్నుల్ లో వాటా కింద అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,09,019 కోట్లను ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణ నెలవారీ మొత్తానికి అదనంగా ఒక విడత నిధులను జతచేసి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధుల ద్వారా ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు దక్కాయి. పండుగల సీజన్, మూలధన వ్యయం, సంక్షేమ కార్యక్రమాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆర్థికశాఖ స్పష్టం చేసింది.