మహేశ్వరం మెడికల్ కాలేజీ సమస్యలపై హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పరిశీలన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఇబ్రహీంపట్నం
మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల కొరతపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళపల్లి సమీపంలోని తాత్కాలిక భవనాన్ని వారు సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సొంత భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేయగా, బీఆర్ఎస్ నేతలు తమ సంఘీభావం తెలిపారు.