పాలేరు జలాశయం వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నామని వెల్లడించిన కలెక్టర్

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయాన్ని కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం సందర్శించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని జిల్లాలోని చెరువులకు మళ్లిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని చెరువుల్లో ముప్పై శాతం వరకు నీరు చేరిందని స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాలువతో పాటు అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి నీటిని తరలిస్తున్నామన్నారు. అల్పపీడనం ప్రభావంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.