నీటి జాడ లేక ఎండిన చెరువుల్లోనే వినాయక నిమజ్జనం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు ఎండిపోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీస నీరు లేకపోయినా ఉత్సవ కమిటీ సభ్యులు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు బీటలు వారిన చెరువుల్లోనే నిమజ్జనం చేస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న గుంతలు తీసి నీటిని పోసి తంతు ముగిస్తున్నారు. మండలంలో నెలకొన్న ఈ నీటి ఎద్దడి స్థానిక ప్రజలను, ఉత్సవ నిర్వాహకులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.