జోరువానలోనూ ఎచ్చెర్లలో సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి ముమ్మర ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి పొందూరు చంద్రరావును గెలిపించాలని నాయకులు జోరువానలో సైతం మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లేయాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో మహిళలు అభ్యర్థికి తిలకం దిద్ది హారతులతో ఘనస్వాగతం పలికారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.