తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ బృందం ముందుకు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల శాఖ ప్రతినిధి బృందం ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆ బృందం, రాష్ట్రంలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించింది. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను సీఎం వారికి వివరించగా, డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.