టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. సుమారు 2,500 మందికి పైగా సిబ్బందిని ఉద్యోపాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పెట్టుబడుల పెంపు, క్లౌడ్ సేవల విస్తరణ కోసమే ఈ కోతలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 12 ఏళ్లుగా పనిచేస్తున్న సౌరభ్ సాహు సహా పలువురు ఉద్యోగులు ఉదయాన్నే తమ లాగిన్‌లు నిలిచిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.