బాపట్ల జిల్లాలో విస్తృతంగా పోలీసుల విజిబుల్ పోలీసింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు మరియు శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేసి అసాధారణ కదలికలపై నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.