అమరావతి క్వాంటమ్ వ్యాలీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో రూ.22,351 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలపై పరిశీలన జరిపారు. సృష్టి క్వాంటమ్ ప్రైవేట్ లિમિటెడ్ ద్వారా రూ.2,700 కోట్ల పెట్టుబడితో అధునాతన తయారీ రంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనల ద్వారా సుమారు 15,816 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.