రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై భట్టి విక్రమార్క ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్లో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు పారదర్శకంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు రూ.450 కోట్ల ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్లను నేరుగా ఖాతాల్లో జమ చేశామని, కాటమయ్య రక్షణ కవచాల కింద కిట్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.