'ప్రాణత్యాగం చేసిన ఉద్యోగుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు': కలెక్టర్ వెంకటేశ్వర్ చొరవ

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తక్షణ పరిష్కారం చూపారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ 2013లో ప్రాణాలు కోల్పోయిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్.ఆర్. శ్రీధర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్. డేవిడ్ కరుణాకరన్ కుటుంబాల 13 ఏళ్ల నివాస స్థలాల సమస్యను ఆయన పరిష్కరించారు. స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామంలో వివాదరహిత ప్రభుత్వ భూమిని గుర్తించి ఇందిర, హెలెన్ మేరీలకు చెరో ఐదు సెంట్లు మంజూరు చేశారు.