రామాయణ సినిమా పైరసీకి చెక్: ముంబై హైకోర్టు డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులు

రిపోర్టర్: హరి స్థలం: ముంబై

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ సినిమాను పైరసీ నుంచి రక్షించేందుకు నిర్మాతలు ముంబై హైకోర్టును ఆశ్రయించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి అనధికారిక వీడియో క్లిప్పులు, లింకుల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కోర్టు డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు లీక్ కాకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.