గ్లోబల్ చెస్ లీగ్‌లో టాప్ స్థానానికి ఏపీఎల్ పైపర్స్ దూసుకెళ్లింది

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్ణాటక

బెంగళూరు వేదికగా జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఏపీఎల్ పైపర్స్ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆరంభంలో గంగేస్ గ్రాండ్‌మాస్టర్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, రెండో మ్యాచ్‌లో అల్లాస్కాన్ నైట్స్‌పై ఘన విజయం సాధించి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. మాగ్నస్ కార్ల్‌సన్ ప్రేరణ, కోనేరు హంపి అద్భుత విజయాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.