చెరువులో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన

రిపోర్టర్: గోపి స్థలం: Mahabubnagar

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో వినాయక విగ్రహ తయారీకోసం బంకమట్టి తేవడానికి వెళ్లిన సాయి తేజ (11) అనే బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సాయంత్రం వేళ తన అన్న నరేందర్‌తో కలిసి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోగా, ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.