స్థానిక సంస్థల ఎన్నికలపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక దృష్టి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఉదయగిరి

ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక కార్యాచరణను ఆయన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.