భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న తల్లాడ మాచవరం వాగు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తల్లాడ
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు మాచవరం వాగు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బిల్లుపాడు, కొత్త వెంకటగిరి, రామచంద్రపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.